Friday, 9 January 2015

Gopala Gopala Movie Review


గోపాల్ రావు (వెంకటేష్) దైవ భక్తి లేని వ్యక్తి. అయితే దేవుడి విగ్రహాలు అమ్మే షాపును నిర్వహిస్తుంటాడు. ఒక భార్య ఇద్దరు పిల్లలతో చిన్న, మద్యతరగతి కుటుంబం. కుటుంబం, వ్యాపారం జీవితంగా ఉన్న గోపాల్ రావు ఓ రోజు దేవుడిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తాడు. అకస్మాత్తుగా భూకంపం వచ్చి గోపాల్ రావు షాపు కూలిపోతుంది. నష్ట నివారణ కోసం ఇన్సూరెన్స్ కంపనీని సంప్రదిస్తే అక్కడ నిరాశ ఎదురవుతుంది. ఇన్సూరెన్స్  కంపనీ ప్రతినిధి దేవుడి చర్యలకు క్లయిమ్ రాదని చెప్పటంతో.., గోపాల్ రావు దేవుడిపై కోర్టులో పిటిషన్ వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, గోపాల్ రావుకు న్యాయం జరిగిందా లేదా అనే విషయాలు తెలియాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి.

పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ సినిమా లేకపోవటంతో ఈ మూవీ కోసం పవర్ ష్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. పవన్ రోల్ తక్కువగా ఉన్నా.. ఆయన పేరుమీదే ఎక్కువగా ప్రమోషన్ జరిగింది. ‘ఓ మై గాడ్’ హిందీ మూవీకి రీమేక్ గా ‘గోపాల గోపాల’ను కిశోర్ పార్థసాని డైరెక్ట్ చేశాడు. సురేష్  ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

వెంకటేష్, శ్రియ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మూడు పాటలే ఉన్నా... అన్నీ సూపర్ హిట్ కావటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి రేసులో చాలా సినిమాలను దాటుకుని వచ్చిన ఏకైక తెలుగు సినిమా ఇదే. సెన్సార్  బోర్డు ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చిన  ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

For Full Movie Review Click On This Link

For Telugu Latest Movie News, Gossips and Review Click Here

Thursday, 8 January 2015

I Movie Censor Completed Gets U Certificate


పట్టుదలతో పనిచేస్తే అనుకున్నది సాధించవచ్చని డైరెక్టర్ శంకర్ నిరూపించాడు. ఈ సూక్తి తాజా అంశానికి సరిగ్గా మ్యాచ్ కాకపోవచ్చు కానీ.., శంకర్ పట్టుదల గురించి ఇంతకంటే ఏమి చెప్పలేము. సెన్సార్ బోర్డుతో చేసిన యుద్ధంలో శంకర్ గెలిచాడు. ఉన్నత స్థాయి సెన్సార్ బోర్డులో ‘ఐ’ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. ఈ మూవీకి చెన్నై బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. వద్దని ముంబైకి వెళ్తే అక్కడ కూడా సేమ్ తీర్పు వచ్చింది. దీంతో చివరి ప్రయత్నంగా ఢిల్లీలోని ఉన్నత స్థాయి సెన్సార్ బోర్డును ఆశ్రయించాడు.

Click Here to Read Full Story

Know More about Latest Telugu Movie Updates and Tollywood News Click Here

Siddarth Samantha Bangalore Days Movie


తెలుగు, తమిళ ఇండస్ర్టీలు అంతా హాట్ హాట్ గా చర్చించుకుంటున్న విషయం ఏమిటబ్బా అంటే సిద్ధార్ధ్- సమంత బ్రేకప్. రెండ్రోజులుగా ఉదయం వేకప్ నుంచి సాయంత్రం ప్యాకప్ వరకు వీరి బ్రేకప్ గురించే రెండు ఇండస్ర్టీల్లో మాట్లాడుకుంటున్నారు. ఎలా బ్రేకప్ అయింది, ఇప్పుడు ఎవరు ఏం చేయబోతున్నారు అని తెగ గుసగుసలాడుకుంటున్నారు. ప్రేమ పెటాకులు కావటంతో ఇక వీరిద్దరూ మళ్లీ కలిసే అవకాశం లేదనీ.. కలిసి సినిమాలు తీసే అవకాశం కూడా లేదని అనుకుంటున్నారు. కాని ఇది నిజం కాదు అని కొందరు చెప్తున్నారు. సమంత లాంటి ప్రాక్టికల్ మనిషి సినిమాను, ప్రేమను ఈజీగా వేరు చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి ప్రేమికులుగా విడిపోయినా.., నటులుగా కలిసే ఉంటారన్నమాట. 

Click Here to Read Full Story

Know More about Latest Telugu Movie Updates and Tollywood News Click Here

Gopala Gopala Movie Postponed


పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గోపాల గోపాల’ సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. సంక్రాంతి రేసులో ఉన్న ఈ మూవీ ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో 9న విడుదల కావటం లేదని స్పష్టం అవుతోంది. సెన్సార్ పనులు పూర్తయితే కాని ఎప్పుడు విడుదల అయ్యేది చెప్పలేము. అయితే మూవీ యూనిట్ వర్గాలు మాత్రం 10 లేదా 11వ తేదీన విడుదల చేస్తామని చెప్తున్నాయి. 

Click Here to Read Full Story

Know More about Latest Telugu Movie Updates and Tollywood News Click Here

Tuesday, 30 December 2014

Air Asia Flight Found In Sea

Air Asia Flight Found In Sea

Air Asia Flight Found In Sea Official Statement Has Given Some Dead Bodies Also Collected - ITEMVIDEO

A day after it disappeared en route from east Java in Indonesia to Singapore, mystery surrounds the fate of AirAsia flight QZ8501 and the 162 people on board that flight found in sea


ITEMVIDEO: ఉత్కంట వీడింది.... విషాదం మిగిలింది

Air asia flight found in sea official statement has given some dead bodies also collected

గత మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమాన సంఘటన విషాదాంతంతో ముగిసింది. సముద్ర ఉపరితలంపై కొన్ని శకలాలు కనిపించిన కొద్ది సేపటికే ఎయిర్ ఏషియా విమానం కూలిపోయినట్లు ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించింది. ఆ ప్రాంతంలోనే కొన్ని మృతదేహాలు సముద్రంలో తేలియాడుతున్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఇండోనేసియా అధికారులు తెలిపారు. మృతదేహాలు బాగా ఉబ్బినా.. అవి పాడవ్వలేదని, వాటిని ఇండోనేషియా నౌకాదళానికి చెందిన ఓ నౌక నుంచి తీరానికి తీసుకొచ్చామని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ డైరెక్టర్ ఎస్.బి. సుప్రియాదీ తెలిపారు. ఈ విషయం తెలియగానే ప్రయాణికుల బంధువుల ఆశల సౌధాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. తమ వారు ఎక్కడో చోట క్షేమంగానే ఉంటారని, తిరిగోస్తారని ఎదురుచూసిన ప్రయాణికుల బంధువులకు తీరని ఆవేదనను మిగిల్చింది.





విమానం రాడార్ పరిధినుంచి తప్పిపోయిన ప్రాంతానికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను తొలుత గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయగా కొన్ని మృతదేహాలు కూడా కనిపించాయి. దాంతో విమానం సముద్రంలోనే కూలిపోయిందని స్పష్టంగా తెలిసింది. ఇక ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రమాదం బారి నుంచి బయటపడ్డారా అనే విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది. ఇంకా అక్కడ ఆ ప్రాంతం లో గాలింపు చర్యలు మమరం చేశారు. ఆ విమానం సముద్ర గర్భానికి వెళ్ళిపోయిందా లేదా కొందరు ప్రయాణికులు విమానంలో నుండి దూకార అన్నది నిర్దారణ కావాల్సి ఉంది. ఒకవేళ విమానం సముద్ర గర్భంలోకి మునిగిపోయి ఉంటె ఆ విమానాన్ని తీసే సాంకేతిక పరిజ్ఞానం కానీ, సామగ్రి కానీ ఇండోనేషియా దగ్గర లేదు. మళ్ళి అమెరికా సహాయాన్ని అది పొందాల్సి ఉంటుంది. అసలు ఆ ప్రాంతం లోనే విమానం మునిగిందా లేదా అన్నది ఇంకా నిర్దారణ కావాల్సి ఉంది.

హరికాంత్
airasia flight found in sea, singapore flights, indonesia flight incident, malaysia flight incidents, indonesia to sinagpore flight, disappeared flight found in sea, java ocean, java sea, flight in java sea, air asia flight found in ocean, flight passengers dead bodies found in sea , Air asia flight found in sea official statement has given some dead bodies also collected

Monday, 29 December 2014

Microsoft CEO Meets Narendra Modi


సత్య నాదెళ్ళ ప్రపంచానికే గర్వ కారణమైన సంస్థ మైక్రో సాఫ్ట్ కు సి ఇ ఒ. నిన్న ఆయన భారత దేశ పర్యటనకు వచ్చారు. భారత్ లో క్రిస్మస్ సంబరాలకు వచ్చిన ఆయన ప్రధాన మంత్రి మోడీ తో సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ మోడీ స్వప్నం అయిన డిజిటల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా లో భాగస్వామ్యం కావాలని ఉందని ఆకాక్షించారు.

Click Here to Know More

Click Here to Know More Political News

TDP MLA's Ready to Join TRS


ఇప్పటికే టిడిపి ఎంఎల్ఏ లు టిఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.. అందులో ఒకరికి మంత్రి పదవి కూడా అధికార ప్రభుత్వం కట్టబెట్టింది. ఇంకొ ఎంఎల్ఏకు మరో ముఖ్య పదవి ఇచ్చే ఆలోచన ఉన్నట్లు కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళి ఇంకొందరు ఎం ఎల్ ఏ లు టిఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు బయట కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ ఎంఎల్ఏ లు కెసిఆర్ నుండి ఏదోక హామీ తీసుకొనే పార్టీ లో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారికి ఇప్పటికే కొన్ని తాయిలాలు అందజేస్తామని తెరాస వర్గాలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

Read More Here....

Click Here to Know More Political News