Showing posts with label ram charan tej new movie. Show all posts
Showing posts with label ram charan tej new movie. Show all posts

Monday, 19 January 2015

Ram Charan Latest Movie Na Peru Raju


గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తర్వాత మెగాహీరో రాంచరణ్ తేజ్ నటించబోయే తదుపరి ప్రాజెక్ట్’కి సంబంధించి ఆమధ్య కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో తన తాజా చిత్రానికి సంబంధించి చెర్రీ చాలా జాగ్రత్తలు పాటించాల్సి వచ్చింది. సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిశ్చయించుకున్న ఈ మెగాహీరో.. కొన్ని కథలను చదివిన అనంతరం ఫైనల్’గా దర్శకుడు శ్రీనువైట్లతో ఫిక్స్ అయ్యాడు. యాక్షన్-ఫ్యామిలీతోపాటు కామెడీ ఎలిమెంట్స్’ను కూడా శ్రీను తన కథలో చేర్చడంతో చెర్రీ అతనితో కమిట్ అయ్యాడు. అప్పుడే ఈ చిత్రానికి ‘నా పేరు రాజు’ అని టైటిల్ ఖరారు కూడా చేశారు. అయితే షూటింగ్ ఎప్పటినుంచి, హీరోయిన్ ఎవరు..? అన్న విషయాలు మాత్రం బహిర్గతం కాలేదు.

ప్రస్తుతం ఇండస్ట్రీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రీను-చెర్రీ కాంబోలో తెరకెక్కనున్న ‘నా పేరు రాజు’ చిత్రం షూటింగ్ మార్చి నెల నుంచి ప్రారంభం కాబోతుందని తెలిసింది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేశారు. ఇక ఇతర పాత్రలకోసం కావలసిన తారాగణాన్ని ఎన్నుకునే పనిలో యూనిట్ బృందాలు నిమగ్నమయ్యాయి. అయతే.. హీరోయిన్ ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. సరికొత్త కథతో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో శ్రీనువైట్ల కామెడీ పంచులు గతంలోకంటే భారీగా వుంటాయని, అవే ఈ చిత్రానికి మరింత బలాన్ని తెచ్చిపెడతాయని యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.

Click Here to View Full Story

Click Here to View Latest Tollywood News